Saturday, May 10, 2014

ప్రేమించా నీ పేరునీ (తుఫాన్) - prEminchaa nee pErunee



పల్లవి:
అతడు:
ప్రేమించా నీ పేరునీ
ప్రేమించా నీ తీరునీ
ప్రేమించానే నిన్నే చేరే నా దారినీ.....

ఆమె:
ప్రేమించా నీ శ్వాసనీ
ప్రేమించా నీ స్పర్శనీ
ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసనీ

అతడు:
ప్రేమించా నీ చిలిపి కోపాన్నీ
ప్రేమించా నీ చిన్ని లోపాన్నీ
ప్రేమించా నువ్వున్న లోకాన్నీ ....
ప్రేమిస్తూ జీవించానే

చరణం-1:
అతడు:
నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
ఓఓఓ...
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే

ఆమె:
కోరింది చెలి దేహం నీ ముద్దులే
ఉండలేనంది చలి కాలం మన మధ్యలో
ఆనంద బంధాలలో

అతడు:
ప్రేమించా అనుకోని పేచీనీ
ప్రేమించా ఆపైన రాజీనీ
ప్రేమించా అటుపైన ఆ ప్రేమనీ.....
ప్రేమిస్తూ జీవించానే

I just love నీ చూపునీ
I just love నిట్టూర్పునీ
ప్రేమించానే మనకై వేచే మునిమాపునీ......

I just love నీ ఊహనీ
ఓఓ ... I just love నీ ఉనికినీ
ప్రేమించానే నీలా విరిసే ఉదయాలనీ

ఓహోహో... ప్రేమించా ఈ మధుర బాధల్నీ
ప్రేమించా ఈ మంచు మంటల్నీ
ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ
ప్రేమిస్తూ జీవించానే

ప్రేమించా ఈ మధుర బాధల్నీ
ప్రేమించా ఈ మంచు మంటల్నీ
ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ
ప్రేమిస్తూ జీవించానే...

రచన: చంద్రబోస్
సంగీతం: చిరంతన్ భట్ట్
గానం: శ్రీరామచంద్ర, షల్మిలి ఖోల్గాడే
చిత్రం: తుఫాన్ (2013)


నేను నువ్వంటు వేరై ఉన్నా (ఆరంజ్) - nEnu nuvvantu from Orange



పల్లవి: నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ..ఓఓఓ...
Oh Girl ...నువ్వే లేకుంటే .... Listen Girl ... ఏమవుతానో
నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా... కాదంటే నామీదోట్టుగా... ఏమైనా చేస్తా నమ్మేట్టుగా...
ఒకసారి చూసి నే వలచానా... నను వీడిపోదు ఏ మగువైనా.... ప్రేమిస్తానే ఎంతో గాఢమ్గా
నా ప్రేమ లోతులో మునిగాక నువు పైకి తేలవే సులభంగా ...ప్రాణాలైనా ఇస్తావేకంగా

నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ..ఓఓఓ...

చరణం-1:
నిజాయితీ ఉన్నోడిని... నిజాలనే అన్నోడిని ... అబద్ధమే రుచించని అబ్బాయినీ...
ఒకే ఒక మంచోడిని ... romance లో పిచ్చోడిని ... ఫర్లెదులే ఒప్పేసుకో సరేనని...
ముసుగేసుకోదు ఏనాడు... నా మనసే ఓ భామా
నను నన్నుగానే చూపిస్తూ కాదన్నా పోరాడేదే నా ప్రేమా... ఓఓఓ...

నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ..ఓఓఓ...

చరణం-2:
తిలోత్తమా తిలోత్తమా ప్రతీక్షణం విరోధమా... ఇవ్వాళ నా ప్రపంచమే నువ్వే సుమా
గ్రహాలకే వలేసినా దివే అలా దిగొచ్చినా ... ఇలాంటి ఓ మగాడినే చూళ్ళేవమ్మా
ఒకనాటి తాజ్ మహలయినా నా ముందు ... పూరిల్లే
ఇకపైన గొప్ప ప్రేమికుడై లోకంలో నిలిచే పేరే నాదేలే... ఓఓఓ ...

నేను నువ్వంటు వేరై ఉన్నా నాకీవేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతగా ..ఓఓఓ...
నువ్వే లేకుంటే .... ఏమవుతానో.. నీ స్నేహాన్నే కావాలంటున్నానుగా... కాదంటే నామీదోట్టుగా... ఏమైనా చేస్తా నమ్మేట్టుగా...
ఒకసారి చూసి నే వలచానా... నను వీడిపోదు ఏ మగువైనా.... ప్రేమిస్తానే ఎంతో గాఢమ్గా
నా ప్రేమ లోతులో మునిగాక నువు పైకి తేలవే సులభంగా ...ప్రాణాలైనా ఇస్తావేకంగా

రచన: వనమాలి
సంగీతం: హారిస్ జైరాజ్
గానం: నరేష్ ఐయ్యర్
చిత్రం: ఆరంజ్ (2010)


Wednesday, May 07, 2014

కోపం వస్తే మండుటెండ - kOpam vastE mandutenda (తారక రాముడు)



పల్లవి:
ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ ॥ 2 ॥
వానమబ్బు లాంటి వాటం నీదయా

అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా  దయా
ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం

కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చరణం-1:
అతడు: చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట
ఆమె: మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా
అతడు: అవునో కాదో తెలియదు కానీ
నువ్వు చెబుతుంటే అవునంటా
ఆమె: మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా
అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా

చరణం-2:
ఆమె: నిండుకుండ కాదు కనుక తొణుకుతుందదీ
అంత వింత అందులోన ఏమిటున్నదీ
అతడు: నాలో తెలివికీ దీన్లో నీటికీ
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నదీ
ఆమె: అమృతం లాంటీ హృదయం నీది
అంత కన్న వేరే వరమేది
అతడు: అది తెలిసి కూడ కసురుకుంటే నేరమెవరిదీ
ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా
అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా
ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం

రచన: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
చిత్రం: తారక రాముడు (1997)


Tuesday, May 06, 2014

అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా - ammagaa kOrukuntunnaa (అమ్మ చెప్పింది)



పల్లవి:
అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా ॥ 2 ॥
నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని
Happy Birthday To You ॥ 2 ॥
Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You

అమ్మగా కోరుకుంటున్నా కోరికే పాడుకుంటున్నా
నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని

చరణం-1:
కలతలెరుగని లోకంలో కాలమాగిపొతే
వన్నె తగ్గని చంద్రుడిలా నువ్వు వెలుగుతుంటే
ప్రతీ నెల ఒకే కళ నీ పాలనవ్వుతో
తారలే నీకు అక్షతలై తల్లి దీవెనలు హారతులై
నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని
Happy Birthday To You ॥ 2 ॥
Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You

చరణం-2:
ఎదురు చూడని కానుకలే దాచి ఉంచేనురా
మలుపు మలుపులో జీవితమే నీకు ఇచ్చేనురా
నువ్వే కదా ఈ అమ్మకి ఒక పెద్ద కానుక
నీకు ఏమివ్వగాలనంట నేను ఆశించడం తప్ప
నూరేళ్ళు జరపాలని నువు పుట్టిన రోజుని
Happy Birthday To You ॥ 2 ॥
Happy Birthday చిన్ని కన్న Happy Birthday To You

రచన, సంగీతం: M. M. కీరవాణి
గానం: ప్రణవి
చిత్రం: అమ్మ చెప్పింది




Sunday, May 04, 2014

తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం (నీకు నేను నాకు నువ్వు)



పల్లవి: 
తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచి పొతే వాళ్ళని నువ్వు మరచినట్టురా
ఇది మరువబోకురా

తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచి పొతే వాళ్ళని నువ్వు మరచినట్టురా
ఇది మరువబోకురా


చరణం-1:
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
mummy, daddy లోన ఆ మాధుర్యం ఎక్కడుంది....

మామా అన్న మాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అత్తా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
Aunty, Uncle లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది?

పరభాషా జ్ఞానాన్ని సంపాదించు ॥ 2 ॥
కాని నీ భాష లోనె నువ్వు  సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ ఋణం తీర్చరా కొంత ఋణం తీర్చరా

మా తెలుగు తల్లి కి మల్లెపూదండ... మా కన్న తల్లికి మంగళారతులు

చరణం-2:
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము

ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడా తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేతున్నాము

అభివృద్ధి కి ఉండాలి నింగే హద్దు ॥ 2 ॥
అది భాషా ఆచారాలను మింగేయొద్దు...

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గు పడకురా వెనక్కి తగ్గమాకురా....

తెలుగు భాష తీయదనం తెలుగు భాష గొప్పదనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం

mummy, daddy అన్న మాట మరుద్దామురా...
అమ్మ, నాన్నా అంటూ నేతి నుండి పిలుద్దామురా, ప్రతిజ్ఞ పూనుదామురా

చిత్రం: నీకు నేను నాకు నువ్వు
రచన: చంద్రబోసు
సంగీతం: R. P. పట్నాయక్
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం, చరణ్