పల్లవి:
అతడు:
ప్రేమించా నీ పేరునీ
ప్రేమించా నీ తీరునీ
ప్రేమించానే నిన్నే చేరే నా దారినీ.....
ఆమె:
ప్రేమించా నీ శ్వాసనీ
ప్రేమించా నీ స్పర్శనీ
ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసనీ
అతడు:
ప్రేమించా నీ చిలిపి కోపాన్నీ
ప్రేమించా నీ చిన్ని లోపాన్నీ
ప్రేమించా నువ్వున్న లోకాన్నీ ....
ప్రేమిస్తూ జీవించానే
చరణం-1:
అతడు:
నా గాలి నిండా నీ పలుకులే
నా నేల నిండా నీ అడుగులే
ఓఓఓ...
నా నింగి నిండా నీ మెరుపులే
నా జగతి నిండా నీ గురుతులే
ఆమె:
కోరింది చెలి దేహం నీ ముద్దులే
ఉండలేనంది చలి కాలం మన మధ్యలో
ఆనంద బంధాలలో
అతడు:
ప్రేమించా అనుకోని పేచీనీ
ప్రేమించా ఆపైన రాజీనీ
ప్రేమించా అటుపైన ఆ ప్రేమనీ.....
ప్రేమిస్తూ జీవించానే
I just love నీ చూపునీ
I just love నిట్టూర్పునీ
ప్రేమించానే మనకై వేచే మునిమాపునీ......
I just love నీ ఊహనీ
ఓఓ ... I just love నీ ఉనికినీ
ప్రేమించానే నీలా విరిసే ఉదయాలనీ
ఓహోహో... ప్రేమించా ఈ మధుర బాధల్నీ
ప్రేమించా ఈ మంచు మంటల్నీ
ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ
ప్రేమిస్తూ జీవించానే
ప్రేమించా ఈ మధుర బాధల్నీ
ప్రేమించా ఈ మంచు మంటల్నీ
ప్రేమించా స్వేచ్ఛాసంకెళ్ళనీ
ప్రేమిస్తూ జీవించానే...
రచన: చంద్రబోస్
సంగీతం: చిరంతన్ భట్ట్
గానం: శ్రీరామచంద్ర, షల్మిలి ఖోల్గాడే
చిత్రం: తుఫాన్ (2013)
No comments:
Post a Comment