Wednesday, May 07, 2014

కోపం వస్తే మండుటెండ - kOpam vastE mandutenda (తారక రాముడు)



పల్లవి:
ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ ॥ 2 ॥
వానమబ్బు లాంటి వాటం నీదయా

అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా  దయా
ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం

కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా

చరణం-1:
అతడు: చెర్లో ఉన్న చాకిరేవు బండ నేనటా
గుళ్ళో ఉన్న అమ్మవారి బొమ్మ నీవట
ఆమె: మురికిని కడిగినా మనసుని కడిగినా
రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లే వేరటా
అతడు: అవునో కాదో తెలియదు కానీ
నువ్వు చెబుతుంటే అవునంటా
ఆమె: మరి అంతలోనె బుంగమూతి సంగతేంటటా
అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా

చరణం-2:
ఆమె: నిండుకుండ కాదు కనుక తొణుకుతుందదీ
అంత వింత అందులోన ఏమిటున్నదీ
అతడు: నాలో తెలివికీ దీన్లో నీటికీ
పోలికే గుళుకు గుళుకు పలుకుతున్నదీ
ఆమె: అమృతం లాంటీ హృదయం నీది
అంత కన్న వేరే వరమేది
అతడు: అది తెలిసి కూడ కసురుకుంటే నేరమెవరిదీ
ఆమె: కోపం వస్తే మండుటెండ మనసు మాత్రం వెండికొండ
వానమబ్బు లాంటి వాటం నీదయా
అతడు: నాకు తెలుసా మంచి చెడ్డ నువ్వు చెబితే నేర్చుకుంట
నిన్ను నమ్మినాను అంతా నీదయా
ఆమె: నీ అల్లర్లు అందం, నీ అలకల్లు అందం
నన్ను కవ్వించి నవ్వించే నీ నేస్తమే మంచి గంధం

రచన: సిరివెన్నెల
సంగీతం: కోటి
గానం: S. P. బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
చిత్రం: తారక రాముడు (1997)


No comments: