Monday, June 23, 2014

ప్రశ్నoటే నింగినే నిలదీసే అల (prasnantE ninginE niladeesE ala) - కార్తికేయ



పల్లవి:
ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా
బదులంటే ఎక్కడో ఏ చోటో లేదురా
శోధించే చూపులో ఓ నలుపై గెలుపై దాగుందంట

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...  బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...  అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే.... ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా


చరణం-1:
పలు రంగులు దాగి లేవా పైక్కనిపించే తెలుపులోన
చిమ్మ చీకటి ముసుగులోను నీడలు ఎన్నో ఉండవా
అడగనిదే ఏ జవాబు, తనకై తానెదురుకాదు
అద్భుతమే దొరుకుతుంది అన్వేషించారా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...  బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...  అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే ... నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం ... లేకుంటే ఎలా

చరణం-2:
ఎపుడో ఎన్నేళ్ళనాడో నాందిగా మొదలైన వేట
ఎదిగే ప్రతి మలుపుతోను మార్చలేదా మనిషి బాట
తెలియని తనమే పునాది... తెలిసిన క్షణమే ఉగాది
తెలివికి గిరిగీత ఏది... ప్రయత్నించరా

ప్రతి ఒక రోజిలా ఒకటే మూసగా...  బ్రతుకును లాగటం బరువేగా మనసుకి
సరికొత్త క్షణాలకై వెతికే దారిగా...  అడుగులు కదుపుతూ పయనిద్దాం ప్రగతికీ

ప్రశ్నంటే నింగినే నిలదీసే అల
ప్రశ్నించే లక్షణం లేకుంటే ఎలా


రచన: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: రంజిత్
చిత్రం: కార్తికేయ (2014)


పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ (punnami vennelakE kannula gantalivee) - కార్తికేయ



పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక  దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ
నిజమును ముసిరిన నివురది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
నిదురను చెరిపిన కలవరమేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
వెలుగుకు వెనుకన వివరము ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
వేలుకు కొలువున విలయమదేమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
పలు ప్రశ్నలకొక బదులది ఏమిటి ఏమిటి ఏమిటి ఏమిటి
తలపును తొలిచెను తరగని చీకటి చీకటి చీకటి
నరుడా గురుడా ఎవరా మూలము
కాలుని పాశమై కదిలెను కాలము
జరిగెటిదిదియే దైవ మహత్యము
కానిచొ ఇదియే మానవ యత్నము
తెలియునదెప్పుడీ మాయ రహస్యము
తెలియుట మాత్రమ-వశ్యమ-వశ్యము
బ్రతుకొక తపముగా పరుగిడు పయనము
తలవని మలుపుగ కనుగొను విజయము
ఆఆఆఆఆఅ....
ఆఆఆఆఅఆ...

పున్నమి వెన్నెలకే కన్నుల గంతలివీ
చూపులకందక  దీపమునార్పిన చేతలు ఎవ్వరివీ


రచన: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: హరి చరణ్
చిత్రం: కార్తికేయ (2014)


ఇంతలో ఎన్నెన్ని వింతలో - నరేష్ అయ్యర్ (inthalO ennenni vinthalO - Naresh Aiyer) - కార్తికేయ



పల్లవి:
ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో; తెరచాటుగా నిను చూసానో

ఆయువో నువు ఆశవో; నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో; నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో

చరణం-1:
చిరునవ్వే నీ కోసం పుట్టిననిపిస్తుంది
నీ ప్రేమే పంచావో గమ్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా
నువు ఎవరవరైతే అరె ఎంటికా
ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలికా ...ఓఓఒ

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో

చరణం-2:
పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
వ్రాసుందో లేదో ముందుగా, నువు కలిసావో ఇక పండుగ
ఉన్నావే నువే నిండుగా, నా కలలకే రంగుగా..ఓఒ

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో; తెరచాటుగా నిను చూసానో

ఆయువో నువు ఆశవో; నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో; నువు ఎవరివో హలా

రచన: కృష్ణ చైతన్య
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: నరేష్ అయ్యర్
చిత్రం: కార్తికేయ (2014)


సరిపోవు కోటి కనులైనా (saripovu koti kanulaina) - కార్తికేయ



పల్లవి:
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు

చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం
కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే

స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
ను... స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

చరణం-1:
ఏంటా నవ్వడం, చూడడం, గుండెనే కోయడం
దూరమే పెంచడం, ఎందుకూ ఈ ఎడం

మనసుకు తెలిసిన మాట; పలకదు పెదవుల జంట
ఎదురుగ నువు రాగానే; నాకేదో అవుతోందట
కనుల ముందు నువ్వు నించున్నా; నే కళ్ళు మూసి కలగంటున్నా
అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో ఉన్నా

స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా

స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

చరణం-2:
నింగే పిడుగులే వదిలినా, పూవులే తడిమినా
ఉరుములే పంచినా, స్వరములే దోచినా
కలవని అపశకునాలే, శుభ తరుణములుగ తేలే
వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే

ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా
కలిసి వచ్చే వింతలన్నీ ఖచ్చితంగా నీ మహిమేనా
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...

నిను దర్శించి దరి చేరి వలచేందుకు

రచన: వనమాలి
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: హరి చరణ్
చిత్రం: కార్తికేయ (2014)


ఇంతలో ఎన్నెన్ని వింతలో - చిన్మయి (inthalO ennenni vinthalO - chinmayee) - కార్తికేయ



పల్లవి: ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను

మాయవో నువు ఆశవో
నువు వీడనీ తుది శ్వాసవో
రాయని ఓ గేయమో
నువు ఎవరివో హలా...

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

చరణం-1:
పరిచయమే పరవశమై నిన్ను నాతో కలిపింది
వ్రాసిందే జరిగింది అయినా కలలా ఉంది

ఒకటయ్యాక మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక

ఇంతలో ఎన్నెన్ని వింతలో
అలవాటులో పొరపాటులెన్నెన్నో

రచన: కృష్ణ చైతన్య
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: చిన్మయి
చిత్రం: కార్తికేయ (2014)


Saturday, June 21, 2014

ఇంతకంటె వేరే అందగత్తెలు - కారుణ్య (intakante vErE andagattelu - kArunya) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది
వందకంటె ఎన్నో కారణాలను ఒక్కక్కొటొక్కటిగ వివరిస్తున్నది

యహుహూ... యహుహూ... యహుహూ...

చరణం-1: కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరీ అనేవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసునీ ఒద్దుద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చే బాగుందని మరింత పెంచుకుని ఇలాగె ఉండి పోతానంటే తప్పైన ఒప్పైనాగాని

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

చరణం-2: కత్రినా కరీనా అంటు కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతోటి చూస్తేసరి తనని మించి మరొకరు లేరనీ అంటారు కద
ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి తనని నా కళ్ళతోనె చూస్తా అంటే  చూడగలనా
నువ్ నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకేనాడు అనలేక పోతున్నాకదా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

యహుహూ... యహుహూ... యహుహూ...

రచన: సిరివెన్నెల
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: కారుణ్య
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)


ఏం సందేహం లేదు (em sandEham lEdu) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
అతడు: ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది
ఏం సందేహం లేదు ఆ గంధాల గొంతే ఆనందాలు పెంచింది
నిమిషము నేల మీద నిలువని కాలి లాగ మది నిను చేరుతోందె చిలకా
తనకొక తోడు లాగ వెనకనే సాగుతోందే హృదయము రాసుకున్న లేఖా

ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది
ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గే ఈ తొందర్లు ఇచ్చింది

చరణం-1:
ఆమె: వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే
నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళాపి జల్లి ఓ ముగ్గేసి వెళ్లావే
నిదురిక రాదు అన్న నిజముని మోసుకుంటు మది నిను చేరుతుంది చిలకా
తనకొక తోడు లాగ వెనకనె సాగుతోంది హృదయము రాసుకున్న లేఖా

ఆమె, అతడు: వెన్నెల్లో ఉన్నా వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే
ఎందర్లో ఉన్నా ఏదోలా ఉంది నువ్వేగుర్తొస్తుంటే

చరణం-2:
అతడు: నీ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి కూ అంటుంది విన్నావా
నీ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పూయిస్తే చాలన్నావా
ఏమవుతున్నాగాని ఏమైనా అయిపోని ఏం ఫర్వాలేదన్నావా
ఆమె: అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమత మైన గుండె గనుక
అడిగినదానికింక బదులిక పంపుతుంది పదములు లేని మౌన లేఖా

రచన: అనంత శ్రీరామ్
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: కళ్యాణి కోడూరి, సునీత
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)


ఇంతకంటె వేరే అందగత్తెలు - హేమచంద్ర (intakante vErE andagattelu - hEmachandra) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరేదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి

చరణం-1: కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరీ అనేవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసునీ ఒద్దుద్దు అని నేనేమైన ఆపగలనా

చరణం-2: కత్రినా కరీనా అంటు కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతో చూస్తే సరీ నిన్ను మించి మరొకరు లేరనీ అంటారు కద
ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి నిన్నే నా కళ్ళతోటి చూస్తనంటే చూడగలనా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది

రచన: సిరివెన్నెల
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: హేమచంద్ర
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)


ఏమిటీ హడావిడి (emitee hadaavidi) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-1:
అతడు: ఓ సమస్యనీ అనేంత scene ఉన్నదా దీనికీ
ఈ అవస్థనీ భరిస్తు దాచేయడం దేనికీ

ఆమె: అలా అలా నువ్వింత తాకినా
పరాకులో మరేమి చేసినా
సరేననీ సరాసరీ surrender అవుతుంది ఈ సిగ్గు మైకంలో మౌనంగా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
అతడు: లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

చరణం-2:
ఆమె: ఈ హుషారులో reverse gear ఏసినా ముందుకే
ఈ మజాలలో others ఛీ కొట్టినా lite లే

అతడు: ఇదే ఇదే romance పద్దతి ఇవ్వాళ్ళిలా గ్రహించమన్నది
వయస్సులో లభించిన వరాన్ని waste అవ్వనీకంది కవ్వించే ఇబ్బంది

అతడు: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

ఆమె: ఏమిటీ హడావిడి ఎదల్లోన
ఎందుకీ హరీబరీ నరాల్లోన
లోపలీ తుఫానిలా  షురూ అయినా
చప్పుడేం ఉండదే పైపైనా

రచన: అనంత శ్రీరామ్
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: దీపు, శ్రావణి V
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)