Saturday, June 21, 2014

ఇంతకంటె వేరే అందగత్తెలు - కారుణ్య (intakante vErE andagattelu - kArunya) - ఊహలు గుసగుసలాడే



పల్లవి:
ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి
ఎందుకంటె ఏమో ఎందుకూ అని తెలియక తికమక పడుతున్నది మది
వందకంటె ఎన్నో కారణాలను ఒక్కక్కొటొక్కటిగ వివరిస్తున్నది

యహుహూ... యహుహూ... యహుహూ...

చరణం-1: కోపగించి బుంగమూతి పెట్టినా
నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా
మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా
ఇదేదో పిచ్చి కదా మరీ అనేవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట
అంతేగాని నీ వెనకనే పడిన మనసునీ ఒద్దుద్దు అని నేనేమైన ఆపగలనా
ఆ పిచ్చే బాగుందని మరింత పెంచుకుని ఇలాగె ఉండి పోతానంటే తప్పైన ఒప్పైనాగాని

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

చరణం-2: కత్రినా కరీనా అంటు కొంతమంది కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె
లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో
నా కళ్ళతోటి చూస్తేసరి తనని మించి మరొకరు లేరనీ అంటారు కద
ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి తనని నా కళ్ళతోనె చూస్తా అంటే  చూడగలనా
నువ్ నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకేనాడు అనలేక పోతున్నాకదా

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకోమరి
ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి

యహుహూ... యహుహూ... యహుహూ...

రచన: సిరివెన్నెల
సంగీతం: కళ్యాణి కోడూరి
గానం: కారుణ్య
చిత్రం: ఊహలు గుసగుసలాడే (2014)


No comments: