Monday, June 23, 2014

ఇంతలో ఎన్నెన్ని వింతలో - నరేష్ అయ్యర్ (inthalO ennenni vinthalO - Naresh Aiyer) - కార్తికేయ

పల్లవి:
ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో; తెరచాటుగా నిను చూసానో

ఆయువో నువు ఆశవో; నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో; నువు ఎవరివో హలా

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో

చరణం-1:
చిరునవ్వే నీ కోసం పుట్టిననిపిస్తుంది
నీ ప్రేమే పంచావో గమ్యం అనిపిస్తుంది
పడిపోయా నేనే నీకికా
నువు ఎవరవరైతే అరె ఎంటికా
ఉందో లేదో తీరిక, ఈ రేయి ఆగాలికా ...ఓఓఒ

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో

చరణం-2:
పైకెంతో అణకువగా సౌమ్యంగా ఉంటుంది
తనతోనే తానుంటే మతిపోయేలా ఉంది
వ్రాసుందో లేదో ముందుగా, నువు కలిసావో ఇక పండుగ
ఉన్నావే నువే నిండుగా, నా కలలకే రంగుగా..ఓఒ

ఇంతలో ఎన్నెన్ని వింతలో; అలవాటులో పొరపాటులెన్నెన్నో
సూటిగా ఓఓఓఓఒ నిను చూడలేనో; తెరచాటుగా నిను చూసానో

ఆయువో నువు ఆశవో; నువు వీడని తుది శ్వాసవో
రాయని ఓ గేయమో; నువు ఎవరివో హలా

రచన: కృష్ణ చైతన్య
సంగీతం: శేఖర్ చంద్ర
గానం: నరేష్ అయ్యర్
చిత్రం: కార్తికేయ (2014)

No comments: