పల్లవి:
అతడు: చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
అతడు: నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ, నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ, ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
ఆమె: నీకో నిజమే చెప్పనా....
నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా... ఆ...హా
వాహువహా... వాహువహా... ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా... వాహువహా... ఎవరినడగాలో ప్రేమేనా అని ...
అతడు: నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ, నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ, ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
చరణం-1:
అతడు: ఇదివరకెరగని స్వరములు పలికెను పగడపు జిలుగుల పెదాల వీణ
బిడియములెరగని గడసరి సొగసుకు తమకము లెగసెను, నరాలలోన ...హా లోనా...
ఆమె: ఏమైందో ఏమిటో, ప్రేమైందో ఏమిటో, నా వాటం మొత్తం ఎంతో మారిందీ...
ఈ మైకం ఏమిటో, ఈ తాపం ఏమిటో నా ప్రాయం మాత్రం నిన్నే కోరిందీ...
ఓఓ...ఓఒ ఓఓ ...
నన్నే నన్నే మార్చి, నీ మాటల్తో ఏమార్చి, ప్రేమించే ధైర్యం నాలో పెంచావోయ్...
కన్ను కన్ను చేర్చి, నా కల్లోకే నువ్వొచ్చి, ఏకంగా బరిలోకే దించావోయ్...
అతడు: చెలిమను పరిమళం మనసుకి తొలివరం
బతుకున అతిశయం వలపను చినుకులే
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే
చరణం-2:
అతడు: మనసున అలజడి వలపని తెలిపిన జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన వరముగ దొరికిన వయారి జాణా... ఆ జాణా
ఆమె: ఈ లోకం కొత్తగా, ఉందయ్యో బొత్తిగా, భూగోళం కూడా నేడే పుట్టిందీ...
నీ వల్లే ఇంతగా, మారాలే వింతగా, నువ్వంటే నాకు పిచ్చే పట్టిందీ...
లాలల్లా లాలల్లాల లాల లాల లాలల్లాల
అతడు: నన్నే నన్నే చూస్తూ, నా గుండెల్లో గుచ్చేస్తూ, నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
(rap: tell me now, tell me now, my dear)
సోకుల గాలం వేస్తూ, నీ మాటల్లో ముంచేస్తూ, ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే
ఆమె: నీకో నిజమే చెప్పనా, నా మదిలో మాటే చెప్పనా, ఎదలో ఏదో తుంటరి థిల్లానా
నాలో ఎదో అల్లరి, అది నిన్న మొన్న లేనిది, మరి ప్రేమో ఎమో ఒకటే హైరానా... ఆ...హా
వాహువహా... వాహువహా... ఏమిటంటారో ఈ మాయనీ
వాహువహా... వాహువహా... ఎవరినడగాలో ప్రేమేనా అనీ ... ప్రేమేనా అనీ... ప్రేమేనా అ... నీ...
ప్రేమేనా అ..నీ...
రచన: కులశేఖర్
సంగీతం: హారిస్ జైరాజ్
గానం: టిప్పు, షాలిని సింగ్
చిత్రం: ఘర్షణ (2004)